పాస్టర్ జాన్ మెకార్థర్ ప్రభువు సన్నిధిలోకి ప్రవేశించారు.
సన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో గల గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడు అయిన జాన్ మాకార్తర్ గారు, 56 సంవత్సరాల విశ్వాసపూర్వక సేవ తరువాత, న్యూమోనియా కారణంగా చికిత్స పొందుతూ, జూలై 14, 2025 సాయంత్రం 6:00 గంటలకు PT (భారత కాలమానం ప్రకారం జూలై 15, 2025 ఉదయం 6:30 IST) ప్రభువుని సన్నిధికి వెళ్లిపోయారు.
ఆయన 3,000 కంటే ఎక్కువ సందేశాలు ప్రసంగించి, దాదాపు 400 పుస్తకాలు రచించి, “గ్రేస్ టూ యూ” ని వ్యవస్థాపించి, ది మాస్టర్స్ యూనివర్సిటీ మరియు సెమినరీ కి నేతృత్వం వహించారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ తన బలమైన నమ్మకాలను నిలబెట్టుకున్నారు.
ఆయన యొక్క అచంచలమైన విశ్వాసం మనకూ ప్రేరణ కలిగించును గాక!. మనమును కూడా భక్తిపరమైన జీవితం గడుపుతూ, స్థిరంగా నిలిచి, ప్రభువు కార్యంలో అభివృద్ధి చెందుటకు కృషి చేద్దాం.
